Monday, December 14, 2009

తెలంగాణాపై ప్రజాబిప్రాయం తెలుసుకోవడంలో విఫలమైనం చంద్రబాబు

తెలంగాణపై ప్రజాభిప్రాయం తెలుసుకోవడంలో అన్ని పార్టీల మాదిరిగానే తామూ విఫలమయ్యామని చంద్రబాబు అంగీకరించారు. రాష్ట్రం ఇప్పుడు రాజకీయంగా గందరగోళాన్ని ఎదుర్కొంటున్నదని, అనాలోచిత నిర్ణయం కారణంగా ప్రాంతాల మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చాయని ఆయన దుయ్యబట్టారు. పార్టీల నిర్ణయాలను నాయకులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోని దుస్థితి ఏర్పడడానికి కేంద్రానిదే బాధ్యత అన్నారు. తెలగుదేశం పార్టీలో కూడా తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, నాయకులు పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించే స్థితికి రావడంతో చంద్రబాబు గందరగోళంలో పడ్డారు. తెలంగాణకు అనుకూలంగా టిడిపి నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్న క్రమంలో ఆ పార్టీకి చెందిన కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ రాజీనామా చేశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకులు కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకరరావు, మోత్కుపల్లి నర్సింహులు తదితరులు పార్టీ అధిష్టానం తీరుతో విసుగెత్తిపోయి సోమవారం మధ్యాహ్నం ప్రత్యేకంగా సమావేశమై ఓ నిర్ణయం తీసుకునేందుకు సమాయత్తం అవుతున్న నేపథ్యంలో చంద్రబాబు సమైక్యాంధ్ర వైపు మొగ్గు చూపుతూ మాట్లాడడం గమనార్హం. ప్రజల నుంచి వచ్చిన వత్తిడి కారణంగానే ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.